POLYCET ADMISSIONS - 2026
పూజ్య ప్రధానోపాధ్యాయులు, గురువులకు నా హృదయపూర్వక వందనములు
10వ తరగతి తర్వాత విద్యార్థులు తీసుకునే నిర్ణయం…
*వారి ఉజ్వల భవిష్యత్తును నిర్ణయించే నిర్ణయం. మీ చేతిలోనే ఉన్నది.
ఒక సురక్షితమైన మార్గం,
ఒక ఉద్యోగ భవిష్యత్తు ఇచ్చే మార్గం ఉంది…
అదే —
పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు చదవడం.
సాంకేతికత విద్య కు మరియు ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు చదవడం.
POLYCET – 2026
(POLYTECHNIC COMMON ENTRANCE TEST - 2026)
ఎందుకు ప్రతి విద్యార్థి POLYCET రాయాలి
పల్లెల్లో ఉన్నా…
పట్టణాల్లో ఉన్నా…
10వ తరగతి పూర్తి చేసిన ప్రతి విద్యార్థి…
ఇప్పుడే 10వ తరగతి పరీక్షలు వ్రాస్తున్న ప్రతి విద్యార్థి…
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా POLYCET – 2026 పరీక్ష రాయాల్సిందే
............
విద్యార్థులకు సూచనలు :
ఇది మీ భవిష్యత్తుకు ఒక అదనపు అవకాశం
ఇది మీ జీవితానికి ఒక సురక్షిత మార్గం
ఇది మీకు 18 ఏళ్లకే ఉద్యోగ అర్హత ఇచ్చే విద్య
రాయకపోతే… ఒక అవకాశం కోల్పోతారు.
రాస్తే… మీ ముందు ఎన్నో అవకాశాలు తెరుచుకుంటాయి.
పరీక్ష వివరాలు
పరీక్ష తేదీ: 25-04-2026 శనివారము
సమయం: ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు
మొత్తం 120 ప్రశ్నలు
గణితం – 50
ఫిజిక్స్ – 40
కెమిస్ట్రీ – 30
కేవలం 2 గంటల పరీక్ష…
అన్నీ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి.
అర్హత సాధించడానికి కావాల్సిన మార్కులు: 30 మార్కులు మాత్రమే.
పాలిటెక్నిక్ అంటే ఏమిటి
10వ తరగతి తర్వాత 3 సంవత్సరాల డిప్లొమా కోర్సు.
ఇది కేవలం పుస్తకాల విద్య కాదు…
ఇది స్కిల్ ఆధారిత విద్య.
ల్యాబ్‌లలో ప్రాక్టికల్స్…
వర్క్‌షాప్‌లలో పనులు…
యంత్రాలతో ప్రత్యక్ష అనుభవం…
మూడేళ్ల తర్వాత మీరు:
Skilled Technician
Junior Engineer
Site Supervisor
Plant Operator
IT Support Engineer
CAD Designer
Electrical Supervisor
గా ఎదుగుతారు.
దేశవ్యాప్తంగా వచ్చే ఉద్యోగ అవకాశాలు
పాలిటెక్నిక్ విద్యార్థులకు అవకాశాలు ఎక్కడ
దేశవ్యాప్తంగా:
రైల్వే శాఖ
విద్యుత్ శాఖ
పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్
నీటి పారుదల శాఖ
మున్సిపల్ సంస్థలు
రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు
కేంద్ర ప్రభుత్వ సాంకేతిక పోస్టులు
డిఫెన్స్ టెక్నికల్ పోస్టులు
పబ్లిక్ సెక్టార్ యూనిట్లు
ప్రైవేట్ ఇండస్ట్రీస్
MNC కంపెనీలు
మరియు… విదేశాల్లో కూడా అద్భుత అవకాశాలు
ప్రతి బ్రాంచ్ విలువైనదే
విద్యార్థులారా…
"ఏ బ్రాంచ్ వస్తే మంచిది" అని చాలామంది అడుగుతారు.
నేను మీకు చెప్పేది ఒక్కటే —
ప్రతి ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ప్రతి బ్రాంచ్ విలువైనదే
సివిల్ అయినా…
మెకానికల్ అయినా…
EEE అయినా…
ECE అయినా…
CSE అయినా…
మీరు ఆ బ్రాంచ్‌లో కష్టపడి చదివి మంచి ఫలితం సాధిస్తే…
ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి
గతంలో చదివిన విద్యార్థుల స్థాయి
ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో చదివిన విద్యార్థులు ఈ రోజు:
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు
ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు
విదేశాల్లో సాంకేతిక నిపుణులుగా ఉన్నారు
స్వంత కంపెనీలు ప్రారంభించారు
కుటుంబాలకు ఆర్థిక బలంగా నిలిచారు
ఒకప్పుడు పేద కుటుంబాల పిల్లలు…
ఈ రోజు తమ తల్లిదండ్రులను గర్వపడే స్థాయికి తీసుకెళ్లారు.
అది పాలిటెక్నిక్ విద్య వల్లే.
3 సంవత్సరాల తర్వాత
18 ఏళ్లకే ఉద్యోగ అర్హత.
ఆర్థిక స్వావలంబన.
లేదా…
ECET ద్వారా B.Tech రెండవ సంవత్సరం ప్రవేశం.
అంటే మీ విద్య అక్కడే ఆగిపోదు.
డిప్లొమా = బలమైన పునాది.
POLYTECHNIC = KNOWLEDGE + SKILLS + FUTURE
ఆ పునాదిపై మీరు ఎంత ఎత్తుకు ఎదగాలో మీ కృషి మీదే ఆధారపడి ఉంటుంది.
తల్లిదండ్రులకు విజ్ఞప్తి:
మీ పిల్లల భవిష్యత్తు కోసం…
వారిని POLYCET రాయించండి.
మూడేళ్ల తర్వాత…
వాళ్లు మీకు అండగా నిలబడతారు.
మీ కష్టానికి ప్రతిఫలం ఇస్తారు.
ఉపాధ్యాయులకు నా ప్రార్థన
మీ ఒక్క మాట…
ఒక విద్యార్థి జీవితాన్ని మార్చగలదు.
10వ తరగతి విద్యార్థులందరికీ ఈ అవకాశాన్ని తెలియజేయండి.
అప్లికేషన్ వేయించండి.
దరఖాస్తు రుసుము
OC / BC – ₹400/-
SC / ST – ₹100/-
అవసరమైనవి:
10వ హాల్ టికెట్
ఆధార్ కార్డు
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
POLYCET – 2026 కి అప్లై చేయండి.
POLYCET రాయండి – పాలిటెక్నిక్‌లో చేరండి – మీ భవిష్యత్తును మీ చేతులతో నిర్మించుకోండి
RIGHT STEP AT RIGHT TIME = FRUITFUL BRIGHT FUTURE.
విద్యార్థులు , మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.
ధన్యవాదములతో
ప్రిన్సిపాల్
ప్రభుత్వ పాలిటెక్నిక్, కందుకూరు
9505504201
9866174419
Coordinator
PLEASE SHARE THIS POLYTECHNIC INFORMATION TO ALL ASPIRANTS & ALL HIGH SCHOOL 10 CLASS STUDENTS GROUPS.
THE POLYCET 2026 NOTIFICATION ISSUED AND REGISTRATION IS STARTED
Contact us
Government Polytechnic, Kandukur.Beside: TRR Degree and Junior Colleges, Uppucheruvu Road, Kandukur, SPSR Nellore District,Andhra Pradesh - 523 105.Phone: 08598 222245Email: gptkdkr@gmail.com
Contact